మీ రిటైర్మెంట్ కోసం మీకు ఎంత డబ్బు అవసరం, రిటైర్మెంట్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి ?
రిటైర్మెంట్ ప్లానింగ్ ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన లక్ష్యాలలో ఒకటిగా ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు, భారతదేశంలో, ఇతర లక్ష్యాల కోసం మనం రిటైర్మెంట్ ప్లానింగ్ వాయిదా వేసుకుంటాము.
ఏది ఏమైనప్పటికి, పిల్లల విద్య మరియు వారి వివాహ ప్రణాళిక లక్ష్యాల జాబితాలో అగ్రస్థానంలో వున్నాము. వీటి కోసం చాలా సంవత్సరాలు రిటైర్మెంట్ ప్రణాళికను పక్కన పెడతాము.
“పదవీ విరమణ ప్రణాళికను రెండు అంశాలుగా సంగ్రహించవచ్చు – మీకు వీలైనంత వరకు ఆదా చేయండి మరియు మీకు సాధ్యమైనంత పెట్టుబడి పెట్టండి. మీరు ఎంత తక్కువ వయసు లో పెట్టుబడి పెడితే మీరు రిటైర్మెంట్ కి అంత ఎక్కువ డబ్బు ఆదా చేస్తారు. అదేవిధంగా, మీరు పెట్టుబడులు ఎంత మంచి చోట చేస్తే , మీ ఇన్వెస్ట్మెంట్ కార్పస్ పెద్దవిగా పెరుగుతాయి.
నేను ఉదాహరణకు ఒక రిటైర్మెంట్ కార్పస్ లెక్కిస్తున్నాను.
ప్రస్తుత వయస్సు: 35 సంవత్సరాలు
రిటైర్మెంట్ వయస్సు: 58 సంవత్సరాలు
రిటైర్మెంట్ కోసం మిగిలివున్న సంవత్సరాలు: 23 సంవత్సరాలు
రిటైర్మెంట్ తర్వాత నెలవారీ అవసరం: తెలుసుకుందాం
ప్రస్తుత నెలవారీ ఖర్చు : 30,000
దీనికి రిటైర్మెంట్ కార్పస్ ఎంత అవసరం: ??
రిటైర్మెంట్ తర్వాత అవసరమైన మీ నెలవారీ మొత్తానికి మీరు ఎలా వచ్చారో తెలుసుకోవాలని వుందా. Inflation రేటును 5% గా లెక్కించి , ప్రస్తుత ఖర్చు 30,000 ని 5% తో లెక్కిస్తే 23 సంవత్సరాల తరువాత మీకు ప్రతి నెల 92,000 అవసరం పడుతుంది.
35 సంవత్సరాల వయస్సులో కేవలం రూ .30000 వద్ద కుటుంబాన్ని నిర్వహించడం ఏదో ఒకవిధంగా సాధ్యం.
సొంతంగా ఇన్వెస్టింగ్ చేసేటప్పుడు చాలా మంది ఇన్వెస్టర్లు తప్పు చేస్తారు.రిటైర్మెంట్ కార్పస్ సరిగ్గా లెక్కించరు.
రిటైర్మెంట్ అనంతరం నెలవారీ అవసరాన్ని సరిగ్గా లెక్కించాలి. ఇది రిటైర్మెంట్ కార్పస్ లెక్కింపు యొక్క ఆధారం.
తదుపరి దశ కార్పస్ ఎంత అవసరమో లెక్కించడం.
ఇక్కడ మరికొన్ని సమాచారం అవసరం
మీ life expectancy (ఎన్ని సంవత్సరాలు బ్రతికి ఉంటాము )ఉండాలి, మీది మాత్రమే కాదు, మీ జీవిత భాగస్వామి యొక్క life expectancy కూడా ముఖ్యమైనది. రిటైర్మెంట్ కార్పస్ ఆమె life expectancy వరకు కొనసాగాలి.
ఇక్కడ నేను life expectancy ఉదాహరణకు తీసుకుంటాను :85 సంవత్సరాలు
రిటైర్మెంట్ కాలం: 27 సంవత్సరాలు (58–85)
రిటైర్మెంట్ కార్పస్పై ఆశించిన రేటు (అంచనా): 14%
Inflation రేటు: 5%
పైన పేర్కొన్న అన్ని అంశాలను పరిశీలిస్తే, రిటైర్మెంట్ కార్పస్ అవసరం సుమారు రూ .2.87 కోట్లు.
రిటైర్మెంట్ కార్పస్ లెక్కించడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. మనము మెడికల్ ఖర్చులు కూడా లెక్కిస్తే రిటైర్మెంట్ కార్పస్ ఇంకా ఎక్కువ కావాల్సి వస్తుంది.
రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం వివిధ పెట్టుబడి ఎంపికలు:
1.PPF – 8% RETURNS
2.EPF (జీతం ఉన్న ఉద్యోగి కోసం) -8% RETURNS
3.MUTUAL FUNDS -14% AVG RETURNS
4.NPS -10% RETURNS
5.INSURANCE INVESTMENT – 6% RETURNS
రిటైర్మెంట్ కార్పస్ 2.8 కోట్లు కోసం ఎంత పెట్టుబడి పెట్టాలి అంటే?
ఇది సహాయపడుతుందని నేను ఆశిస్తున్నాను. దయచేసి మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోండి.
హ్యాపీ ఇన్వెస్టింగ్ !!!