ఆరోగ్య బీమాను ఎలా చదవాలి?సరైన ఆరోగ్య బీమా పాలసీని ఎలా ఎంచుకోవాలి

ఆరోగ్య బీమా పాలసీని ఎంచుకోవడం కష్టం.  అనేక భీమా సంస్థలు వేర్వేరు  హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తున్నాయి, మీ అవసరాలకు సరిగ్గా సరిపోయేదాన్ని ఎంచుకోవడం  కష్టంగానే  ఉండవచ్చు. ఈ రోజుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్  విద్యార్థులు, కుటుంబాలు, గుండె జబ్బులు, డయాబెటిస్  మరియు మరెన్నో ఆరోగ్య సమస్యలను కవర్ చేస్తునాయి  కాబట్టి మొదట మనం ఎలాంటి సమస్య కింద పాలసీ తీసుకోవాలి అనే నిర్ణయం తీసుకోవాలి.

బీమా పాలసీ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి.  భీమా ప్రణాళిక మీ అన్ని అవసరాలను తీర్చాలి.  ఈ ఆర్టికల్ లో  హెల్త్ ఇన్సూరెన్స్  పాలసీని ఎలా ఎంచుకోవాలో చూద్దాం.

 

ప్రీమియం

ప్రీమియం అంటే మీరు ఎంచుకున్న బీమా పాలసీ కోసం ప్రతి నెల లేదా ముడు నెలలకు చెల్లించే మొత్తం.  ప్రీమియం మీ వయస్సుపై ఆధారపడి ఉంటుంది.  మీ వయస్సు తక్కువ ఉంటే, మీ ప్రీమియం మొత్తం తక్కువగా ఉంటుంది.  ప్రీమియం మొత్తం వయస్సుతో పెరుగుతుంది.  ఆరోగ్య భీమా తీసుకునే ముందు మీరు తప్పనిసరిగా మొత్తం ఆరోగ్య తనిఖీ చేయించుకోవాలి.

 

కవరేజ్

కవరేజ ఎప్పుడూ మీ ఏజ్  ఇంకా మీకు ఉన్న రిస్క ని బట్టి సెలెక్ట్ చేసుక్కవాలి. చాలా  భీమా పధకాలు ప్రీమియం మరియు వారు కవర్ చేసే ఖర్చుల లిస్ట్  ఆధారంగా వేర్వేరు కవరేజీని అందిస్తాయి.  మీ జీవితంలో మీరు ఎదుర్కొనే ప్రమాదం ప్రకారం మీరు కవరేజ్ మొత్తాన్ని ఎంచుకోవచ్చు.మీరు కుటుంబంలో సంపాదించే ఏకైక వ్యక్తి అయితే, ఇక్కడ మీకు  ఎక్కువ ప్రమాదం ఉంది కాబట్టి మీరు ఎక్కువ మొత్తానికి బీమా తీసుకోవలసి ఉంటుంది.ఇది ఏదైనా ఆక్సిడెంట్ సమయం లో  సహాయం చేస్తుంది  లేదా టెంపరరీ ఎక్సపెన్సెస్ లేదా మరణం విషయంలో ఉపయోగం వస్తుంది.

కొన్నిసార్లు మీరు భీమా మొత్తాన్ని క్లెయిమ్ చేయనప్పుడు, భీమా సంస్థలు మీకు బోనస్ ఇస్తాయి. ఉదాహరణకు మీరు 10 లక్షల కవరేజ్ తీసుకుంటే.  మీరు బీమాను క్లెయిమ్ చేయకపోతే కంపెనీ మీకు 12 లక్షల విలువైన కవరేజీని ఇస్తుంది.

వ్యక్తిగత vs కుటుంబ ఫ్లోటర్ ప్రణాళిక

ఆరోగ్య భీమాలో రెండు ప్రధాన రకాలు ఉన్నాయి.  ఒకటి వ్యక్తిగత ఆరోగ్య బీమా పథకం, రెండోది కుటుంబ ఫ్లోటర్ ఆరోగ్య బీమా పథకం.  ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌లో కుటుంబంలోని ప్రతి వ్యక్తి పాలసీ తీసుకోవలసిన అవసరం లేదు.  ఈ విధానం మొత్తం కుటుంబ ఆరోగ్య అవసరాలను కవర్ చేస్తుంది.  ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్  లో ప్రీమియం అమౌంట్ ఎక్కువ ఉంటుంది. ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ తీసుకునే సమయంలో మీ కుటుంబ సభ్యులందరూ అంటే భర్త, భార్య, పిల్లలు లేదా తల్లిదండ్రులు ఇద్దరిని ఈ ప్రణాళిక  కవర్ చేసుకోవచ్చు.

 

క్యాష్‌లెస్ vs రీయింబర్స్‌మెంట్ ప్రణాళికలు

ఆరోగ్య బీమా ప్రణాళిక  రెండు ప్రధాన రకాలు ఉన్నాయి. క్యాష్‌లెస్ ఇంకా  రీయింబర్స్‌మెంట్.  మొదటి సందర్భంలో భీమా సంస్థలు  నేరుగా వైద్య బిల్లులను ఆసుపత్రికి చెల్లిస్తాయి.  కానీ రెండవ సందర్భంలో మీరు  బిల్లును ఆసుపత్రికి చెల్లించవలసి ఉంటుంది, అప్పుడు మీకు  15 రోజుల్లోపు  మీరు కట్టిన మొత్తం బీమా కంపెనీకి  తిరిగి చెల్లింస్తుంది.

 

నెట్‌వర్క్ హాస్పిటల్స్

మీరు పాలసీని తీసుకునే సమయంలో భీమా సంస్థ మీకు కార్డ్ ఇస్తుంది.  కార్డ్ లో  మీ దగ్గరలోని  ఆసుపత్రి లిస్టు కలిగి ఉంటుంది.  హాస్పిటల్ జాబితాలోని ఆసుపత్రి మీకు దగ్గరగా ఉందని నిర్ధారించుకోండి.  అత్యవసర పరిస్థితుల్లో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.  మీరు 24 గంటలకు పైగా ఆసుపత్రిలో ఉంటే, ఆ మొత్తాన్ని భీమా సంస్థ చేల్లిస్తుంది.  మీరు జాబితా లోని ఆసుపత్రులలో ఒకదానిలో చేరినట్లయితే, భీమా సంస్థ ఆ మొత్తాన్ని ఆసుపత్రితో తనిఖీ చేసి నేరుగా చేల్లిస్తుంది.  మీరు జాబితాలో లేని ఆసుపత్రిలో చేరితే, మీరు మీరే బిల్లులు చెల్లించాలి.  మీరు  ఆ బిల్లును తరువాత బీమా కంపెనీలో ఇస్తే మీకు రీయింబర్స్‌మెంట్ ఇవ్వబడుతుంది.  నెట్‌వర్క్ హాస్పిటల్స్ వల్ల నగదు రహిత ప్రయోజనాలు ఉంటాయి.  మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే , మీ బీమా పథకం మీకు దగ్గరగా ఉన్న ఆసుపత్రులను కవర్ చేస్తుందని మీరు చూడాలి.

 

ప్రీ-హాస్పిటలైజేషన్ vs పోస్ట్ హాస్పిటలైజేషన్ ప్రయోజనాలు

ఆరోగ్య బీమా పథకాలలో ప్రీ-హాస్పిటలైజేషన్ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి.  ప్రీ-హాస్పిటలైజేషన్ ప్రయోజనం ఒక నెల వ్యవధిని కలిగి ఉంటుంది. ప్రీ-హాస్పిటలైజేషన్ అంటే   వ్యాధి వలన రోగి ఆసుపత్రిలో చేరడానికి ముందు చేసిన వైద్య ఖర్చులు.హాస్పిటల్ లో చేరి కోలుకున్న  తర్వాత రోగి డిశ్చార్జ్ అయిన తర్వాత అయ్యే వైద్య ఖర్చును ఆసుపత్రి పోస్ట్ హోస్టుపితలిసాషన్ ఖర్చులు గా సూచిస్తాయి.  చాలా ఆరోగ్య బీమా పాలసీలు ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయ్యిన తేదీ తర్వాత 45-90 రోజుల మధ్య ఎక్కడైనా ఈ ఖర్చులను భరిస్తాయి.

అన్ని భీమా పధకాలు ఈ ప్రీ-హాస్పిటలైజేషన్ మరియు పోస్ట్-హాస్పిటలైజేషన్ ప్రయోజనాలను అందించవు.  కాబట్టి ఈ ప్రయోజనాలు ఉన్న బీమా పథకాన్ని ఎంచుకోండి.

 

 పన్ను ప్రయోజనాలు, క్లెయిమ్ సెట్టలేమెంట్ రేషియో

 

మీ ఆరోగ్య బీమా పథకానికి మీరు చెల్లించే ప్రీమియానికి పన్ను ప్రయోజనాలు ఉన్నాయి.  ప్రీమియం మొత్తాన్ని బట్టి, మీ పన్ను చెల్లింపును తగ్గించవచ్చు sec 80d -upto 50000.

క్లెయిమ్ సెటిల్మెంట్కు వస్తున్నప్పుడు, అత్యధిక క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో  కలిగిన ఆరోగ్య బీమా కంపెనీని ఎంచుకోండి.  క్లెయిమ్ సెటిల్మెంట్ అంటే ఆ సంవత్సరంలో బీమా కంపెనీ పరిష్కరించిన క్లెయిమ్‌ల సంఖ్య.

క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువ ఉంటే, మన క్లెయిమ్  అమౌంట్ డిఫాల్ట్ అవ్వటానికి  ప్రమాదం తక్కువ.  సాధారణంగా చాలా కంపెనీలకు క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 90% కంటే ఎక్కువ ఉంటుంది .

కొన్ని కంపెనీలకు, క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 93% పైన ఉంది.  అటువంటి సంస్థలను ఎంచుకోవడం ద్వారా మీకు ఎటువంటి ప్రమాదం ఉండదు. కొన్ని కంపెనీలు తక్కువ ప్రీమియం ఉన్న బీమా పథకాన్ని ఇస్తుంటాయి. అలాంటి కంపెనీస్ కి క్లెయిమ్ సెట్టలేమెంట్ రేషియో చాలా తక్కువగా ఉంటుంది.  క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువ లేకపోతె ప్రేమియం మొత్తం తక్కువ ఉన్న ఉపయోగం ఉండదు.

 

వెయిటింగ్ పీరియడ్‌

వెయిటింగ్ పీరియడ్‌  మీరు ఎంచుకున్న  ప్లాన్ పై ఆధారపడి ఉంటుంది.  ముందుగా ఉన్న వ్యాధులకు నిరీక్షణ కాలం ఎక్కువ  ఉంటుంది.  ఉదాహరణకు మీకు డయాబెటిస్ ఉంటే, వెయిటింగ్ పీరియడ్‌లో మీ ప్లాన్ కింద మీ సమస్యను క్లెయిమ్ చేయలేరు.

మీరు ఎంచుకున్న ప్లాన్ లో వెయిటింగ్ పీరియడ్ తక్కువగా ఉండేటట్టు చూసుకోండి.  కనీస వెయిటింగ్ పీరియడ్‌ కనీసం రెండేళ్లు ఉంటుంది .  కొన్ని కంపెనీలకు నాలుగు సంవత్సరాల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది.  మీకు ముందుగా ఏమైనా వ్యాధులు వున్నారు ఐతే వెయిటింగ్ పీరియడ్ తగ్గించుకునేలాగా చుడండి .

పాలసీ తీసుకున్న వెంటనే అన్ని వ్యాధులు కవర్ అవ్వవు. కొన్ని వ్యాధులుకు ప్రత్యేకంగా 2 సంవత్సరాలు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే పాలసీ తీసుకున్న రెండేళ్లు తర్వాత ఈ వ్యాదులుని ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. అవి ఏంటి అంటే

 • Arthritis (if non-infective), Osteoarthritis and Osteoporosis, Gout, Rheumatism and Spinal Disorders, Joint Replacement Surgery;
 • Surgical treatments for Benign ear, nose and throat (ENT) disorders and surgeries (including but not limited to Adenoidectomy, Mastoidectomy, Tonsillectomy and Tympanoplasty), Nasal Septum Deviation, Sinusitis and related disorders;
 • Benign Prostatic Hypertrophy; IV Cataract;
 • Dilatation and Curettage;
 • Fissure / Fistula in anus, Hemorrhoids / Piles, Pilonidal Sinus, Ulcers of Gastro Intestinal tract; VII Surgery of Genito urinary systems;
 • All types of Hernia, Hydrocele;
 • Hysterectomy for menorrhagia or fibromyoma or prolapse of uterus;
 • Internal tumors, skin tumors, cysts, nodules, polyps including breast lumps; XI Kidney Stone / Ureteric Stone / Lithotripsy / Gall Bladder Stone;
 • Myomectomy for fibroids;
 • Varicose veins and varicose ulcers;
 • Pancreatitis;
 • End stage liver disease;
 • Procedures for Retinal disorders; XVII Cerebrovascular accident;Renal Failure / End Stage Renal Disease;
 • Cardiomyopathies;
 • Myocardial Infarction;
 • Heart failure, Arrhythmia / Heart blocks ,ASD/VSD/PDA;
 • All types of Cancer;
 • Arthroscopic Knee Surgeries/ACL Reconstruction/Meniscal and Ligament Repair.