మ్యూచువల్ ఫండ్స్ నుంచి మొదటి కోటి రూపాయిలు ఎలా సంపాదించాలి.

మీకు పెట్టుబడి పెట్టడానికి కొన్ని ఎంపికలు ఉన్నాయి. మీరు బ్యాంక్ లో ఫిక్స్‌డ్ డిపాజిట్‌లతో వెళితే, మీకు సంవత్సరానికి 6.5% లభిస్తుంది.

మీరు రిస్క్ తీసుకొని , క్రిప్టో కరెన్సీల వంటి చాలా ప్రమాదకరమైన వాటిలో పెట్టుబడి పెడితే – మీరు చాలా త్వరగా పొందవచ్చు. కానీ అదే సమయంలో, అపారమైన ప్రమాదం ఉంది. కాబట్టి మొత్తాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది.

ఐతే ఒక మంచి ఎంపిక ఏమిటి అంటే SIP / lumpsum ద్వారా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం.

అది మంచి ఎంపిక  ఎలా అంటే 2 కారణాలు వలన

  1. సగటు రూపాయి ఖర్చు(Rupee cost of Averaging):

  • మార్కెట్ హెచ్చు తగ్గులను సున్నితంగా చేస్తుంది.
  • తక్కువ కొనుకొని  మరియు అధికంగా అమ్మాలి అనే సూత్రానికి అనుగుణంగా పనిచేస్తుంది.
  • మార్కెట్ నష్టంలో ఎక్కువ యూనిట్లు కొనడానికి సహాయపడుతుంది. 
  • ఒకే మొత్తాన్ని క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం వలన కొనుగోలు ఖర్చును తగ్గిస్తుంది.
  • మార్కెట్ వోలాటలిటీ తగ్గించడంలో సహాయపడుతుంది.

20000 sip returns mutualfundstelugu

 

పైన ఫండ్ లో సగటు యూనిట్ ఖర్చు 25.2 పడుతుంది. మార్కెట్ ధర 38 వున్నా మీరు కొన్నది 25.2 పడుతుంది అదే సగటు రూపాయి ఖర్చు(Rupee cost of Averaging).

మీరు Nippon small cap fund లో nov  2011 కి 20000 పెట్టుబడి పెట్టి ఉంటే nov  21 కి అది 40 లక్షలు  ఉండేది . కోటి రూపాయిలు రావడానికి మీరు 13 సంవత్సరాలు ఉండాలి . అదే బ్యాంకు లో  డిపాజిట్ చేస్తే  మీకు కోటి  రూపాయిలు రావడానికి 19 సంవత్సరాలు  పడుతుంది . 19 సంవత్సరాలకి  మ్యూచువల్ ఫండ్స్  లో ఎంత వస్తుందో చూదాం .

 


 2. కాంపౌండింగ్ యొక్క శక్తి

కాంపౌండింగ్ ప్రయోజనాన్ని పొందడానికి ఉత్తమ మార్గం ప్రారంభంలో ఇన్వెస్ట్మెంట్ చేసి  మరియు ఎక్కువ సమయం ఇన్వెస్ట్మెంట్ కలిగి ఉండడం

 “కాంపౌండింగ్ ఇంటరెస్ట్ ప్రపంచంలోని ఎనిమిదవ అద్భుతం. దాన్ని అర్థం చేసుకున్నవాడు, సంపాదిస్తాడు … లేనివాడు … చెల్లిస్తాడు. ”- ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

 

  • రిటర్న్ పెట్టుబడి మొత్తంలోనే కాదు, రోజు రోజుకు పెరుగుతున్న మొత్తంలోనూ సంపాదించబడుతుంది.
  • కాంపౌండింగ్ యొక్క నిజమైన ప్రయోజనం దీర్ఘకాలికంగా మాత్రమే కనిపిస్తుంది.
  • కాంపౌండింగ్ బెనిఫిట్ పొందడానికి సమయం కీలకమైన అంశం.

నెలకు 20,000 పెట్టుబడి విలువ ఎలా ఉంటుందో  చుడండి  18% రాబడి తో లెక్కించి చుస్తే :

20000 సిప్ ముతుల్ ఫండ్స్ తెలుగు

ఇన్వెస్ట్మెంట్ సమయం పెరిగే కొద్దీ రాబడి పెరుగుతుంది. 15 సంవత్సరాల పెట్టుబడి పెడితే 1.8 కోట్లు అవుతుంది అదే 20  సంవత్సరాల పెట్టుబడి పెడితే 4.7 కోట్లు అవుతుంది.

ఇన్వెస్ట్మెంట్ సమయం పెరిగే కొద్దీ రాబడి పెరుగుతుంది.

కాబట్టి, ముందుగానే ప్రారంభించండి, క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టండి & కాంపౌండింగ్ శక్తికి అంతరాయం కలిగించవద్దు. 

హ్యాపీ ఇన్వెస్టింగ్ !!!

మీరు 20000 కాకుండా తక్కువ పెట్టుబడి తో కోటి రూపాయిలు రావడానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకోవడానికి ఈ calculator ఉపయోగించండి. ఇంటరెస్ట్ రేట్ 15% తో లెక్కించండి.