భారత్ బాండ్ etf 2020

DEBT FUND/BOND FUND అంటే ఏమిటి?

DEBT మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడుతున్నారు అంటే మీరు ప్రభుత్వంకి లేదా ప్రైవేట్  కంపెనీస్  కి అప్పు ఇస్తున్నట్టు.

గవర్నమెంట్ లేదా ప్రైవేట్ కంపెనీస్ అప్పు కావలసినప్పుడు ప్రజలు దగ్గర డబ్బులు అప్పు గ తీసుకుంటారు తీసుకున్న అప్పుకి దీర్ఘ కలంలో  వడ్డీ కడతారు. మరియు అప్పు తీసుకున్న గడువు ముగిసాక డబ్బు తిరిగి ఇచ్చేస్తారు. అప్పు తీసుకున్నప్పుడు ప్రభుత్వం లేదా ప్రైవేట్ కంపెనీస్ హామీ కింద ఒక బాండ్ ఇస్తాయి వాటినే DEBT FUND/BOND FUND అంటారు.

ఉదాహారానికి : మీరు గవర్నమెంట్ దగ్గర ఒక బాండ్ కొనుగోలు చేసుకున్నారు.

బాండ్ maturity 5 సంవత్సరాలు

వడ్డీ రేటు 7%

బాండ్ రేట్ 10,000 అనుకుందాం.

దీని  అర్ధం ఏమిటి అంటే మీరు గవర్నమెంట్ కి 10000 అప్పుగా ఇస్తున్నారు తిరిగి గోవర్నమెంట్ మీకు 5 సంవత్సరాలులో ఆ డబ్బు తిరిగి ఇస్తుంది. తీసుకున్న డబ్బుకి గవర్నమెంట్  మీకు 7% వడ్డీ ఇస్తుంది.

Bharat Bond ETF

Bharat Bond ETF రెండు రకాలుగ పని చేస్తుంది

  1. పైన చెప్పినట్టు ఇది ఒక బాండ్ప, పని  తీరు దెబ్ట్  ఫండ్ లాగానే ఉంటుంది.
  2. ఇది స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ అవుతుంది,దీని లాభం ఏమిటి అంటే మీరు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు మార్కెట్ లో ఈ బాండ్ ని అమ్ముకోవచ్చు. మరియు ఇది INDEX DEBT FUND.

అసలు Bharat Bond ETF ఏమిటి ?

భారత్ బాండ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఇటిఎఫ్) ను డిసెంబర్ 4 న భారత ప్రభుత్వం ఆవిష్కరించింది.

13 డిసెంబర్ నుంచి 20 డిసెంబర్ లోపు ఈ ETF  లో మీరు పెట్టుబడులు పెట్టుకోవచ్చు.

దేశంలో మొట్టమొదటి కార్పొరేట్ బాండ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ అయిన భారత్ బాండ్ ఇటిఎఫ్ ని Edelweiss Asset Management Company (AMC) నిర్వహిస్తోంది.

భారత్ బాండ్ ఇటిఎఫ్ అనేది కేంద్ర ప్రభుత్వ ఇచ్చే  బాండ్ లో  పెట్టుబడి పెడుతుంది . (ప్రారంభంలో, అన్ని AAA రేటెడ్ బాండ్లుఉంటాయి .)

  1.  భారత్ బాండ్ ఇటిఎఫ్ 3 years ,10 years maturity కలిగి ఉంటుంది మరియు స్టాక్ ఎక్స్ఛేంజీలలో ట్రేడ్అవుతుంది .
  2.  ప్రభుత్వం ఇప్పటివరకు ఈక్విటీ ETF మాత్రమే అనుమతించింది, ఏప్రిల్ నుంచి 2019/20 ఆర్థిక సంవత్సరంలో ఇటిఎఫ్‌ల ద్వారా ప్రభుత్వం దాదాపు, 4 14,400 కోట్లు సమీకరించింది.
  3. మీరు 1000 రూపాయిలుతో ఈ బాండ్ లో పెట్టుబడి పెట్టుకోవచ్చు మరియు ఈ బాండ్ యొక్క expense ratio కేవలం 0.0005% మాత్రమే. అంటే 200000 పెట్టుబడికి కేవలం 1 రూపాయి మాత్రమే ఫీజ్ కట్టాలి.
  4. ఇది మొట్ట మొదటి పాసివ్ దెబ్ట్ మ్యూచువల్ ఫండ్ . Nifty BHARAT Bond Index పెర్ఫార్మన్స్ ని ట్రాక్ చేస్తుంది .
  5. మూడేళ్ల భారత్ బాండ్ ఇటిఎఫ్ 13 ప్రభుత్వ రంగ సంస్థలైన National Highways Authority (NHAI), Indian Railway Finance Corporation (IRFC), Indian Railway Finance Corporation (IRFC) కలిగి ఉంటుంది. India’s Power Grid Corporation. Twelve public sector companies including Rural Electrification Corporation (REC), Power Finance Corporation (PFC) సహా పన్నెండు ప్రభుత్వ రంగ సంస్థలు పదేళ్ల భారత్ బాండ్ ఇటిఎఫ్ రుణాన్ని ఉంచుతాయి.
  6. 3 సంవత్సరాలు మరియు 10 సంవత్సరాల కాలానికి Bharat Bond ETF లో పెట్టుబడులు పెట్టినవారికి 6.69% మరియు 7.58% వడ్డీ ఇస్తారు
  7. సాధారణ దెబ్ట్ మ్యూచువల్ ఫండ్ల మాదిరిగా బాండ్ ఇటిఎఫ్‌లకు పన్ను విధించబడుతుంది. ఇండెక్సేషన్ ప్రయోజనం అందించిన తరువాత 36 నెలలకు పైగా పెట్టుబడులపై మూలధన లాభాలు 20% పన్ను విధించబడతాయి. దీని అర్ధం ఫిక్స్డ్ డిపాజిట్ తో పిలిచి చుస్తే ETF  లో మీకు టాక్స్ తగ్గుంతుంది .36 నెలలు లోపు పెట్టుబడులు తిరిగి తీసుకుంటే లాభాలూ  మీ ఇన్కమ్ టాక్స్ స్లాబ్ లో చూపించుకోవాలి .
  8. బాండ్ ఇటిఎఫ్‌లు పాసివ్ ఫండ్స్ , ఇవి ఇండెక్స్ లో పెట్టుబడులు పెడతాయి. నిఫ్టీ 50 స్టాక్స్‌లో నిఫ్టీ 50 ఇటిఎఫ్ పెట్టుబడులు పెట్టినట్లే, బాండ్ ఇటిఎఫ్ స్టాక్స్‌కు బదులుగా బాండ్లను కలిగి ఉన్న ఇండెక్స్ లో పెట్టుబడి పెడతాయి.

భారత్ బాండ్ ETF

Nifty BHARAT Bond Index – April 2023 constituents (Tentative portfolio)

Issuer Credit Rating Weights
Power Finance CORP.LTD. AAA 15.00%
REC Limited AAA 15.00%
NATIONAL BANK FOR AGRICULTURE & RURAL DEVELOPMENT AAA 15.00%
HOUSING & URBAN DEVELOPMENT CORP.LTD. AAA 11.84%
EXPORT-IMPORT BANK OF INDIA AAA 8.00%
POWER GRID CORP.OF INDIA LTD. AAA 7.24%
SMALL INDUSTRIES DEVELOPMENT BANK OF INDIA AAA 7.00%
NTPC LTD. AAA 6.67%
HINDUSTAN PETROLEUM CORP.LTD. AAA 4.87%
NATIONAL HIGHWAYS AUTHORITY OF INDIA AAA 3.85%
NUCLEAR POWER CORP.OF INDIA LTD. AAA 2.43%
INDIAN RAILWAY FINANCE CORP.LTD. AAA 1.88%
NHPC LTD. AAA 1.21%

పైన AAA  అంటే ఏమిటి అంటే బాండ్స్ కి ఒక రేటింగ్ ఉంటుంది ఆ రేటింగ్ ఈత ఎక్కువ ఉంటే బాండ్స్ లో రిస్క్ అంత తక్కువ ఉంటుంది. సాధారణంగా AAA రేటెడ్ బాండ్స్ అంటే మంచి క్వాలిటీ వున్నా బాండ్స్ అని చెప్పుకోవచ్చు.

BHARAT Bond ETF లో వున్నా రిస్క్ :

వడ్డీ రేటు ప్రమాదం: వడ్డీ రేట్లు పెరిగినప్పుడు స్థిర బాండ్స్  యొక్క ధర పడిపోతుంది మరియు దీనికి విరుద్ధంగా, ఇది NAV ని ప్రభావితం చేస్తుంది. కింద వున్నా వీడియో చుస్తే మీకు ఇది అర్ధం అవుతుంది.

క్రెడిట్ రిస్క్ లేదా డిఫాల్ట్ రిస్క్: క్రెడిట్ రిస్క్ అంటే బాండ్ లేదా మనీ మార్కెట్ పరికరం జారీచేసేవారు డిఫాల్ట్ కావచ్చు అంటే వడ్డీ & / లేదా మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులు సమయానికి ఇవ్వలేకపోవచ్చు .

ప్రభుత్వ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నం కాబ్బటి రిస్క్ ఎప్పుడు తక్కువగానే ఉంటుంది. వడ్డీ మరియు అసలు క్రమం గానీ ఇస్తారు. మరియు పైన వున్న వీడియో చసుయినట్టు ఐతే మీకు బాండ్ మార్కెట్ కి ఇంట్రెస్ట్ రేట్స్ కి వున్నా శమందం అర్ధం అవుతుంది అందువల్ల మీరు భారత్ ETF వాల్యూ పెరిగినప్పుడు మంచి NAV కి అమ్ముకోవచ్చు.

తక్కువ రిస్క్ తో బ్యాంకు డిపాజిట్ కంటే ఎక్కువ రేటూర్న్స్ కోరుకునవల్కి ఇది మంచి పెట్టుబడి అవకాశం.

BHARAT Bond ETF లో ఎలా పెట్టుబడి పెట్టాలి

BHARAT Bond ETF లో పెట్టుబడి పెట్టడానికి మీకు డీమ్యాట్  అకౌంట్ అవసరం లేదు GROWW లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు .

GROWW అకౌంట్ లేకపోతె కింద ఫోటో న=మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి.