AXIS BLUECHIP FUND VS ICICI PRU BLUECHIP FUND VS NIPPON INDIA LARGECAP FUND
Large cap Mutual Funds
లార్జ్ క్యాప్ ఈక్విటీ ఫండ్స్ అనేది ఒక రకమైన మ్యూచువల్ ఫండ్, ఇది పెద్ద మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న సంస్థలలో పెట్టుబడులు పెడుతుంది.
లార్జ్-క్యాప్ కంపెనీలు మంచి ట్రాక్ రికార్డ్ మరియు వారు సాధారణంగా స్థిరమైన కార్పొరేట్ పాలన పద్ధతులను కలిగి ఉంటారు. దీర్ఘకాలికంగా తమ పెట్టుబడిదారులకు నెమ్మదిగా మరియు స్థిరంగా సంపదను సంపాదించిన ఈ కార్పొరేట్ సంస్థలు ఎల్లప్పుడూ మార్కెట్లో ఎక్కువగా అనుసరించే వాటిలో ఉన్నాయి.
భారతదేశంలో, మ్యూచువల్ ఫండ్లను లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ ఫండ్లుగా విడతీయడానికి SEBI కొత్త న షరతులను తీసుకొచ్చింది.
Large cap funds : ఇది పూర్తి మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా భారత దేశం లో వున్న 1-100 స్థానం లో వున్న సంస్థలలో పెట్టుబడి పెట్టాలి.
AXIS BLUECHIP FUND VS ICICI PRU BLUECHIP FUND VS NIPPON LARGE CAP FUND
క్రింద విశ్లేషణ రోలింగ్ రిటర్న్స్ ఆధారంగా ఉంటుంది.
రోలింగ్ రిటర్న్స్ గురించి మీకు తెలియకపోతే, దయచేసి క్రింద ఆర్టికల్ చదవమని నేను అభ్యర్థిస్తున్నాను.
5 ఉత్తమ LARGE CAP మ్యూచువల్ ఫండ్స్
నేను ఫండ్స్ ని 2010-2018 వరకు లెక్కించి రిటర్న్స్ ఎలా ఉన్నాయో చూస్తాను తరువాత 2018-2019 కి లెక్కించి రిటర్న్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను.
కారణం ఏమిటి అంటే 2018-2019 మార్కెట్ తగ్గుబాటుని మనం చూసాం ఇలాంటి సమయం లో ఎలాంటి ఫండ్స్ రిటర్న్స్ ఇచ్చాయి మరియు ఎలా రిటర్న్స్ ఇవ్వగలిగాయి అని కూడా మనం చూదాం.
5 Yr Rolling Returns (RR) analysis
05-Jan-2010 to 31-Dec-2018 | Return Statistics (%) | |||
Fund Name | Average | Maximum | Minimum | Std |
Axis Bluechip Fund-Reg(G) | 14.21 | 20.41 | 8.46 | 5.75 |
Nippon India Large Cap Fund(G) | 16.21 | 23.28 | 9.73 | 6.48 |
ICICI Pru Bluechip Fund(G) | 15.25 | 20.58 | 9.53 | 5.72 |
మ్యూచువల్ ఫండ్స్ లెక్కింపులో కీలక పాత్ర standard deviation పోషిస్తుంది. standard deviation కోసం పూర్తి వివరాలు క్రింద వీడియోలో వున్నాయి తప్పక చుడండి.
మీరు 2010-2018 ఎప్పుడైనా 5 సంవత్సరాలు నిరంతరం పెట్టుబడి పెట్టినట్లయితే
Axis Bluechip Fund లో
ఎ) గరిష్ట రాబడి 20.41% ఉండేది.
బి) కనీస రాబడి 8.46% ఉండేది.
సి) సగటు రాబడి అంటే XIRR రాబడి 14.21% ఉండేది.
దీని అర్ధం 5 సంవత్సరాలు కలం లో ఎప్పుడైనా మార్కెట్ ఫాల్ వచ్చిన మీకు ఈ ఫండ్ లో కనీసం 8.46% అయినా రిటర్న్స్ వస్తాయి.
రిస్క్ పరంగా మీరు చూసినట్టు ఐతే Axis Bluechip Fund లో 5 సంవత్సరాలు కలం కి 5.75 % రిస్క్ మాత్రమే వుంది.
Nippon India Large Cap లో
ఎ) గరిష్ట రాబడి 23.28% ఉండేది.
బి) కనీస రాబడి 9.73 % ఉండేది.
సి) సగటు రాబడి అంటే XIRR రాబడి 16.21% ఉండేది.
దీని అర్ధం 5 సంవత్సరాలు కలం లో ఎప్పుడైనా మార్కెట్ ఫాల్ వచ్చిన మీకు ఈ ఫండ్ లో కనీసం 9.73% అయినా రిటర్న్స్ వస్తాయి.
రిస్క్ పరంగా మీరు చూసినట్టు ఐతే Nippon India Large Cap లో 5 సంవత్సరాలు కలం కి 6.48 % రిస్క్ మాత్రమే వుంది.
ICICI Pru Bluechip Fund లో
ఎ) గరిష్ట రాబడి 20.58% ఉండేది.
బి) కనీస రాబడి 9.53 % ఉండేది.
సి) సగటు రాబడి అంటే XIRR రాబడి 15.25% ఉండేది.
దీని అర్ధం 5 సంవత్సరాలు కలం లో ఎప్పుడైనా మార్కెట్ ఫాల్ వచ్చిన మీకు ఈ ఫండ్ లో కనీసం 9.53% అయినా రిటర్న్స్ వస్తాయి.
రిస్క్ పరంగా మీరు చూసినట్టు ఐతే ICICI Pru Bluechip Fund లో 5 సంవత్సరాలు కలం కి 5.72 % రిస్క్ మాత్రమే వుంది.
పైన వున్నా 3 ఫండ్స్ లో NIPPON కి రిస్క్ ఎక్కువ మరియు ICICI Pru Bluechip Fund లో రిస్క్ మరియు రిటర్న్స్ రెండు బాగున్నట్టు మనకి తెలుస్తుంది.
3 Yr Rolling Returns (RR) analysis (2010-2018)
మీరు 2010-2018 ఎప్పుడైనా 3 సంవత్సరాలు నిరంతరం పెట్టుబడి పెట్టినట్లయితే
07-Jan-2010 to 31-Dec-2018 | Return Statistics (%) | |||
Fund Name | Average | Maximum | Minimum | Std |
Axis Bluechip Fund-Reg(G) | 13.44 | 28.52 | 0.98 | 12.46 |
Nippon India Large Cap Fund(G) | 14.95 | 31.69 | -2.28 | 17.23 |
ICICI Pru Bluechip Fund(G) | 14.39 | 26.01 | 2.43 | 11.96 |
మీరు 2010-2018 ఎప్పుడైనా 5 సంవత్సరాలు నిరంతరం పెట్టుబడి పెట్టినట్లయితే
Axis Bluechip Fund లో
ఎ) గరిష్ట రాబడి 28.52% ఉండేది.
బి) కనీస రాబడి 0.98% ఉండేది.
సి) సగటు రాబడి అంటే XIRR రాబడి 13.44% ఉండేది.
మీరు చూసినట్టు ఐతే ఈ ఫండ్ లో రిటర్న్స్ రావడానికి కనీసం 3 సంవత్సరాలు ఆగాలి.ఎందుకంటే 3 సంవత్సరాల్లో ఎప్పుడైనా మార్కెట్ ఫాల్ వస్తే ఈ ఫండ్ 0.98% మాత్రమే రిటర్న్స్ ఇవ్వగలదు.
కనుక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో తక్కువ కాలానికి ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు.
రిస్క్ పరంగా మీరు చూసినట్టు ఐతే Axis Bluechip Fund లో 3 సంవత్సరాలు కలం కి 12.46 % రిస్క్ మాత్రమే వుంది.
Nippon India Large Cap లో
ఎ) గరిష్ట రాబడి 31.69% ఉండేది.
బి) గరిష్ట నష్టం -2.28 % ఉండేది.
సి) సగటు రాబడి అంటే XIRR రాబడి 14.95% ఉండేది.
దీని అర్ధం 3 సంవత్సరాలు కలం లో ఎప్పుడైనా మార్కెట్ ఫాల్ వస్తే మీకు ఈ ఫండ్ లో -2.28% నష్టం వస్తుంది. కనుక ఈ ఫండ్ లో మీరు కనీసం 5 సమ్వత్సరాలకి పెట్టుబడి పెట్టాలి.
రిస్క్ పరంగా మీరు చూసినట్టు ఐతే Nippon India Large Cap లో 5 సంవత్సరాలు కలం కి 17.23 % రిస్క్ మాత్రమే వుంది.
ICICI Pru Bluechip Fund లో
ఎ) గరిష్ట రాబడి 26.01% ఉండేది.
బి) కనీస రాబడి 2.43 % ఉండేది.
సి) సగటు రాబడి అంటే XIRR రాబడి 14.39% ఉండేది.
దీని అర్ధం 3 సంవత్సరాలు కలం లో ఎప్పుడైనా మార్కెట్ ఫాల్ వచ్చిన మీకు ఈ ఫండ్ లో కనీసం 2.43% అయినా రిటర్న్స్ వస్తాయి.
రిస్క్ పరంగా మీరు చూసినట్టు ఐతే ICICI Pru Bluechip Fund లో 3 సంవత్సరాలు కలం కి 11.96 % రిస్క్ మాత్రమే వుంది.
మీరు చూసినట్టు ఐతే 3 సంవత్సరాల కాలానికి ఫండ్స్ లో రిస్క్ ఎక్కువ వుంది మరియు కనీస రాబడి కూడా తక్కువ వుంది.
1 Yr Rolling Returns (RR) analysis (2010-2018)
05-Jan-2010 to 31-Dec-2018 | ||||
Fund Name | Average | Maximum | Minimum | Std |
Axis Bluechip Fund-Reg(G) | 12.65 | 54.97 | -22.21 | 34.86 |
Nippon India Large Cap Fund(G) | 14.44 | 73.76 | -26.19 | 40.63 |
ICICI Pru Bluechip Fund(G) | 13.96 | 58.5 | -18.13 | 32.09 |
పైన వున్నా టేబుల్ గమనిస్తే 1 సంవత్సర కాలానికి Nippon India Large Cap Fund లో -26.19% నష్టం వచ్చింది మరియు రిస్క్ కూడా 40.63% వుంది.
ICICI Pru Bluechip Fund లో -18.13% నష్టం వస్తుంది మరియు రిస్క్ కూడా 32.09% వుంది.
Axis Bluechip Fund లో నష్టం -22.21% వుంది మరియు రిస్క్ 34.86% వుంది.
2010-2018 వరకు మీరు పైన వున్నా ఫండ్స్ ప్రదర్శన చూసినట్టు ఐతే ICICI Pru Bluechip Fund , Axis Bluechip Fund కంటే మెరుగైన ప్రదర్శన ఇచ్చింది.
Nippon India Large Cap Fund లోకొంచెం రిస్క్ ఎక్కువ వుంది కానీ రిటర్న్స్ పరంగా టాప్ ఫండ్ గ నిల్చింది.
ఐతే ఇది 2010-2018 ప్రదర్శన ఇప్పుడు 2018-2019 ఎలా ఉందొ చూదాం.
Rolling Return Statistics – 1 Year | |||
01-Jan-2018 to 06-Dec-2019 | Return Statistics (%) | ||
Fund Name | Average | Maximum | Minimum |
Axis Bluechip Fund-Reg(G) | 9.77 | 26.75 | -0.9 |
Nippon India Large Cap Fund(G) | 4.4 | 16.61 | -11.06 |
ICICI Pru Bluechip Fund(G) | 3.04 | 11.59 | -8.13 |
Index Fund- Plan(G) | 8.76 | 18.9 | -3.66 |
2018 -2019 రిటర్న్స్ చుస్తే Axis Bluechip Fund చాల మంచి రిటర్న్స్ చుమోయించింది. Sensex లో సగటు రిటర్న్స్ 8.76% ఉండగా Axis Bluechip Fund లో 9.77% వున్నాయి
గరిష్ట రాబడి Axis Bluechip Fund లో 26.75 % వుంది Sensex లో 18.9%.
ఒక సంవత్సరం లో Axis Bluechip Fund ఎందుకు ఇంత మంచి పెర్ఫార్మన్స్ ఇవ్వగలిగింది అంటే?
- Axis Bluechip Fund Portfolio
Axis Bluechip Fund లో కేవలం 24 స్టాక్స్ మాత్రమే వున్నాయి అందులో 10 FINANCE సెక్టార్ స్టాక్స్ వున్నాయి.
కిందటి సమ్వత్సరం FINANCE ఇండెక్స్ 27.40% రాబడి ఇచ్చింది. 42% స్టాక్స్ ఫైనాన్స్ సెక్టార్ లోనే ఉండడం వలన Axis Bluechip Fund మంచి ప్రదర్శన చూపించింది.
2. Axis Bluechip Fund Portfolio changes
కిందటి 3 నెలల్లో Eicher Motors Ltd 29% రిటర్న్స్ ఇచ్చింది . ప్రస్తుత మార్కెట్ పరిస్థితి చుస్తే Banking&finance సెక్టార్ మరియు Consumer Durable మినహాయించి వేరే అసెక్టర్ కూడా పెద్దగా ప్రదర్శన చూపించలేదు .
Axis Bluechip Fund లో రెండు సెక్టర్లు 50% ఉండడం వలన మంచి ప్రదర్శన చూసాం మనం .
3. Cash Holdings.
Axis Bluechip Fund లో 16.52% కాష్ రూపం లో వుంది . దీని అర్ధం మన 100 రూపాయిలు పెట్టుబడి పెడితే అందులో 16 రూపాయిలు స్టాక్స్ లో కాకుండా కాష్ రూపం లో ఉంచుతారు దాని వలన మన డబ్బు 16% సేఫ్ గ వుంటుంది .
గత సంవస్త్రం మార్కెట్ ఫాల్ లో Axis Bluechip Fund కి Cash Holdings నష్టం తగ్గించాయి .
ఇందువలన Axis Bluechip Fund గత సంవత్సరం నుంచి మంచి ప్రదర్శన చూపిస్తుంది.
మీరు ఎలాంటి అడ్వైసర్ లేకుండా మ్యూచువల్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే Axis Bluechip Fund మీకు సరి కాదు ఎందుకంటే తక్కువ స్టాక్స్ ఉండడం వలన ఫైనాన్స్ సెక్టార్ లో ఎప్పుడైనా ఫాల్ వస్తే మీరు ఏ ఫండ్ లో ఎక్కువ లాస్ చూసే అవకాశం వుంది.
మీరు ICICI Pru Bluechip Fund లో పెట్టుబడి పెట్టుకోవడం మంచిది .
If you have any question, tag me and put that in comment.
Happy to help you
Happy Ending 2019
Regards
Gopi Krishna