5 ఉత్తమ LARGE CAP మ్యూచువల్ ఫండ్స్

5 LARGE CAP ఫండ్స్ ని విశ్లేషించి, నిఫ్టీ 100 TRI పోల్చి రిటర్న్స్ ఎలా వచ్చాయో చుదాం .

 

మీలో ఎక్కువ మంది రాబడిని తనిఖీ చేసిన తర్వాత పెట్టుబడి పెడతారు, మీరు 3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలకు అత్యధిక రాబడిని కలిగి ఉన్న ఫండ్ లో పెట్టుబడి పెడతారు..

 

కానీ అవి వార్షిక రాబడి(ANNUALIZED RETURNS) ,అవేరేజ్ రిటర్న్స్ ,అవి చూసి మీరు పెట్టుబడి పెట్టకూడదు.

 

మీరు ప్రతి నెల 10 వ తేదీన SIP రూపంలో పెట్టుబడి పెట్టవచ్చు, నేను ప్రతి నెల 15 న పెట్టుబడి పెడతాను మరియు మరొకరు 20 న పెట్టుబడి పెట్టవచ్చు.

 

వార్షిక రాబడి 1 జనవరి నుండి 31 డిసెంబర్ వరకు లెక్కించి ఉంటుంది, మీరు ఎప్పుడైనా 1 వ జనవరి కి పెట్టుబడి పెట్టారా  మరియు డిసెంబర్ 31 న రీడీమ్ చేసారా?

 

Returns since inception , quarterly రిటర్న్స్ తో కూడా అదే సవాల్.

 

కాబట్టి మేము రాబడి భాగాన్ని ఎలా లెక్కించాలి? నేను నవంబర్ లో ఇన్వెస్ట్ చేసి జనవరి కి రేడీమ్ చేసుకుంటే నాకు ఎంత రిటర్న్స్ వస్తుంది ఎలా తెలుసుకోవాలి?

 

పరిష్కారం రోలింగ్ రిటర్న్స్.

 

రోలింగ్ రిటర్న్స్ ఏమిటో అర్థం చేసుకుందాం?

 

 ఉదాహరణకు: నేను 6 సంవత్సరాల కాలానికి 3 ఇయర్ రోలింగ్ రిటర్న్స్ అని చెప్పినప్పుడు దాని అర్థం

(అంటే నేను 6 సంవత్సరాల ఒక ఫండ్ లో ఇన్వెస్ట్ చేదాం అనుకుంటున్నాను కనుక ఆ ఫండ్ ప్రతి 3 సంవత్సరాలకి ఎలా పెర్ఫర్మ్ చేసిందో చూడాలి అనుకుంటున్నాను.)

 

 31-మే -2019 నుండి 1 జూన్ 2016 వరకు – 3 సంవత్సరానికి రాబడిని లెక్కించండి

 

30-మే -2019 నుండి 31-మే -2016 వరకు – 3 సంవత్సరానికి రాబడిని లెక్కించండి

 

29-మే -2019 నుండి 30-మే -2016 వరకు – 3 సంవత్సరానికి రాబడిని లెక్కించండి

 

.

 

.

 

.

 

.

 

31-మే -2016 నుండి 01-జూన్ -2013 వరకు

 

నేను గత 6 సంవత్సరాలుగా ప్రతి పునరావృతానికి 3 సంవత్సరాల వెనుకకు వెళ్తాను.

 

అంటే నేను సాధారణంగా ఒక బుల్ మార్కెట్ మరియు ఒక బేర్ మార్కెట్‌ను కలిగి ఉన్న 6 సంవత్సరాల డేటాను స్కాన్ చేయగలను.

సరళంగా చెప్పాలంటే, రోలింగ్ రిటర్న్స్ ద్వారా మీరు మార్కెట్లో ఏ రోజునైనా పెట్టుబడి పెట్టుకొని, (ఏ రోజునైనా ఒక సంవత్సరం / నెల / వారంలో) రాబడిని తనిఖీ చేసుకోవచ్చు.

ఇక్కడ, నేను 9 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో (1, 2 ,3 మరియు 5 సంవత్సరాలు) వరుస రాబడిని తీసుకున్నాను, ఆపై ఫండ్ ఎలా పని చేసిందో చూడటానికి సగటును తీసుకున్నాను.

రోలింగ్ రాబడి చాలా కాలం పాటు ఫండ్ యొక్క స్థిరత్వాన్ని కొలుస్తుంది.

మీలాంటి పెట్టుబడిదారులకు రోలింగ్ రాబడిని కొలవడం చాలా కష్టం అందుకీ మీకు అడ్వైసర్ అవసరం ఉంటుంది.

 

5 LARGE CAP FUND ANALYSIS.

 

5  ఫండ్స్  ఏమిటి  అంటే 
 
  1. Axis Bluechip Fund(G)
  2. HDFC Top 100 Fund(G)
  3. ICICI Pru Bluechip Fund(G)
  4. Nippon India Large Cap Fund(G)
  5. SBI BlueChip Fund-Reg(G)
కింద టేబుల్ లో ఫండ్  డీటెయిల్స్  వున్నాయి.
 
FUNDS SNAPSHOT MUTUAL FUNDS TELUGU

 
ఇప్పుడు  రోలింగ్  రిటర్న్స్  చూదాం .

 

2010  నుండి 5 సంవత్సరాలకి రోలింగ్ రిటర్న్స్ 2019 వరకు చూదాం. అంటే 9 సంవత్సరాలుకి లెక్కించి చూదాం.

 

5 ఇయర్స్ రోలింగ్ రిటర్న్స్ మూతుల ఫండ్స్

 

HDFC Top 100 Fund(G) 90 సార్లు ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది.

Axis, Icici, Nippon, Sbi  ఇండెక్స్ కంటే 100 సార్లు ఎక్కువరిటర్న్స్ ఇచ్చాయి.

మీరు కనుక SBI BlueChip Fund లో ఎప్పుడైనా 2010 -2019 లోపు 5 ఇయర్స్ కి ఇన్వెస్ట్ చేసిఉంటే మీకు కనీసం 8.3% రిటర్న్స్ వచ్చేవి, సగటు 16.45%  రిటర్న్స్ వచ్చేవి.

 

2010  నుండి 2019 వరకు 3 సంవత్సరాలకి రోలింగ్ రిటర్న్స్ చూదాం.

 

3 యెఅర్స్ రొల్లింగ్ రెతుర్న్స్

 

  1. SBI BlueChip Fund-Reg(G) ఇండెక్స్  ని 67% మాత్రమే  ఓడించగలిగింది . ఫండ్ 80% ఇండెక్స్ కంటే బాగా రిటర్న్స్  ఇవ్వాలి కానీ SBI BlueChip Fund-Reg(G) 3 ఇయర్స్ కి ఇండెక్స్ కంటే అంత ఎక్కువ పెర్ఫార్మన్స్ ఇవ్వలేదు.
  2. Nippon India Large Cap Fund(G), ICICI Pru Bluechip Fund(G), ఇండెక్స్ కంటే 90% బాగా రిటర్న్స్ ఇచ్చాయి.కానీ Nippon India Large Cap Fund లో 3 ఇయర్స్ కూడా -2.28% నష్టం వచ్చింది. Icici లో 2.43% ప్రాఫిట్ వచ్చింది.
  3. ICICI Pru Bluechip Fund(G) లో రిస్క్ తక్కువ.
  4. HDFC Top 100 Fund(G) ఇండెక్స్ కంటే 75% మాతర్మే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది, రిటర్న్స్ కూడా అంత మంచిగా లేవు.
  5. Axis Bluechip Fund(G ఇండెక్స్ కంటే 81% ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది రిస్క్ కూడా తక్కువ వుంది.

 

2010  నుండి 1 సంవత్సరానికి రోలింగ్ రిటర్న్స్ 2019 వరకు చూదాం అంటే 9 సంవత్సరాలుకి లెక్కించి చూదాం.

 

1 year rolling returns

 

ICICI Pru Bluechip Fund ఇండెక్స్ కంటే 80 % ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది.

 

Axis Bluechip Fund(G) కూడా ఇండెక్స్ కంటే 78%  ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది.

 

Nippon India Large Cap Fund(G) 74% ఎక్కువరిటర్న్స్ ఇచ్చింది.

1 ఇయర్ రోలింగ్ రిటర్న్స్ మనం exit అవ్వడానికి ఉపయోగిస్తాం.

 

SBI BlueChip Fund-Reg(G) ki గత 5 సంవత్సరాలలో మంచి పనితీరు కనబరిచింది కానీ కానీ గత 3 మరియు 1 సంవత్సరాల పనితీరు మంచిగ లేదు మరియు ఇండెక్స్ ని ఓడించే అవకాశం 55% కి వచ్చేసింది.

 

దీని అర్ధం ఫండ్ గత 3 సంవత్సరాలగ బాగోలేదు అని.

 

HDFC Top 100 Fund(G) పరిస్థితి కూడా అంతే.

 

Nippon ,icici, axis ఫండ్స్ బాగున్నాయి Nippon లో రిస్క్ ఎక్కువ వుంది కానీ స్థిరమైన ప్రదర్శన చూపించింది. 

 

ICICI Pru Bluechip Fund కూడా తక్కువ రిస్క్ తో మంచి ప్రదర్శన చూపించింది.