జపనీస్ కాండిల్ స్టిక్ అంటే ఏమిటి?

జపనీస్ కాండిల్ స్టిక్స్ అనేవి ట్రేడర్స్ సెక్యూరిటీ (shares) ధరల కదలికను  విశ్లేషించడానికి ఉపయోగించే ఒక సాంకేతిక విశ్లేషణ  సాధనం. క్యాండిల్ స్టిక్ చార్టింగ్ అనే భావనను ఒక జపాన్ బియ్యం వ్యాపారి మునెహిసా హొమ్మా (Munehisa Homma) కనుగొన్నారు. రొటీన్ ట్రేడింగ్  సమయంలో, బియ్యం మార్కెట్  పై వ్యాపారుల భావోద్వేగాల(emotions) ప్రభావం ఉందని దాని వలన బియ్యం ధరపై డిమాండ్ మరియు సరఫరా (supply) ప్రభావితమైందని హొమ్మా గుర్తించారు.

కాండిల్ స్టిక్  పాటర్న్  అంటే ఏమిటి?

జపనీస్ క్యాండిల్ స్టిక్ నమూనాలు (candlestick patterns) 1700 లో మునీహిసా హొమ్మా అనే జపనీస్ బియ్యం వ్యాపారి నుండి ఉద్భవించాయి.

దాదాపు 300 సంవత్సరాల తరువాత దీనిని జపనీస్ కాండిల్ స్టిక్ చార్టింగ్ టెక్నిక్స్ అని స్టీవ్ నిసన్ అనే రచేయిత  ప్రపంచానికి పరిచయం చేశారు.

ఇది జపనీస్ క్యాండిల్ స్టిక్ నమూనాల వెనుక ఉన్న సంక్షిప్త చరిత్ర.

క్యాండిల్ స్టిక్ చార్ట్  ని ఎలా చదవాలో నేర్చుకుందాం…

జపనీస్ క్యాండిల్ స్టిక్ చార్ట్ (candlestick chart) ని ఎలా చదవాలి?

ఒక కాండిల్  లో మనకి 4 విషయాలు తెలుస్తాయి. ఆ రోజు ఆ షేర్ మార్కెట్ లో ఎంత రేటుకి ఓపెన్ అయింది ఎంత రేటుకు క్లోజ్ అయింది. ఆ రోజు లో ఆ షేర్ ప్రైస్  ఎంత ఎక్కువకి వెళ్ళింది ఎంత తక్కువ కి వెళ్ళింది అని తెలుస్తుంది. క్యాండిల్ స్టిక్లో  ఓపెన్ అండ్ క్లోజ్ మధ్యలో వున్నా చోటుని body  అంటాము. పైన మరియు కింద్ వున్నా లైన్స్ ని షాడోఅని అంటాము .

కాండిల్ స్టిక్

ప్రతి క్యాండిల్ స్టిక్ నమూనా (candlestick pattern) 4 డేటా పాయింట్ల (data points) ను కలిగి ఉంటుంది:

High Price

క్యాండిల్ స్టిక్  లో High Price షాడో  పైభాగం ద్వారా సూచించబడుతుంది. ఓపెనింగ్ ప్రైస్ మరియు క్లోసింగ్  ప్రైస్ /High Price ఒకటే అయి ఉంటే, అప్పుడు upper షాడో ఉండదు.

Low Price

Low ప్రైస్ ,షాడో కింది భాగం లేదా body కింది tail ద్వారా సూచించబడుతుంది. ఓపెన్  లేదా క్లోజ్ ఒకటే ప్రైస్  దగ్గర అయి ఉంటే, అప్పుడు ఏ lower shadow ఉండదు.

Close Price

క్లోజ్ ప్రైస్  కాండిల్ లో చివరగా ట్రేడ్ అయిన ప్రైస్ అవుతుంది. కాండిల్స్ రెండు రకాలు ఉంటాయి Bearish కాండిల్, Bullish కాండిల్. పచ్చ రంగులో ఉంటే Bullish కాండిల్ అంటారు ఎరుపు రంగులో ఉంటే Bearish కాండిల్ అంటారు.

Bearish కాండిల్ కి క్లోజ్ కింద వైపు ఉంటుంది మరియు Bullish కాండిల్ కి పైన ఉంటుంది.

 

Open Price

Bearish కాండిల్ కి ఓపెన్ పైన ఉంటుంది మరియు Bullish కాండిల్ కి కింద వైపు ఉంటుంది.

షేర్ ప్రైస్ పడుతుంది అంటే Bearish కాండిల్ తయారు అవుతుంది అదే షేర్ ప్రైస్ పెరుగుతుంది అంటే Bullish కాండిల్ తయారు అవుతుంది.

ఒక కాండిల్  ఏర్పడుతున్నప్పుడు, అది ధర కదిలే కొద్దీ మారుతూ ఉంటుంది. Open అలాగే ఉంటుంది, కానీ కాండిల్  పూర్తయ్యే వరకు, High మరియు low ధరలు మారుతూ ఉంటాయి. క్యాండిల్ స్టిక్ ఏర్పడుతుండగా రంగు కూడా మారవచ్చు. ఉదాహరణకు, ప్రస్తుత ధర open price పైన ఉండి ఉంటే ఇది ఆకుపచ్చ రంగు లో ఉంటుంది ఆ తరువాత ప్రైస్ తగ్గిపోతే ఎరుపుకి మారిపోతుంది.

కాండిల్ యొక్క కాల వ్యవధి ముగిసినప్పుడు, ఆ కాండిల్  పూర్తవుతుంది, మరియు ఒక కొత్త కాండిల్  ఏర్పడటం మొదలవుతుంది.

గుర్తుంచుకోండి…

ఒక బుల్లిష్ కాండిల్ (bullish candle) కి, open ఎల్లప్పుడూ close కింద ఉంటుంది.

ఒక బేరిష్ కాండిల్ (bearish candle) కి, open ఎల్లప్పుడూ ముగింపు close పైన ఉంటుంది.

కొన్ని చార్టులలో, ఆకుపచ్చ రంగును తెలుపు , మరియు ఎరుపు రంగును నలుపు  గా చూపించవచ్చు. మార్కెట్ ధోరణి (trend) ని చాలా స్పష్టంగా సూచిస్తూ, open price కంటే ముగింపు ధర (closing price) ఎక్కువగా ఉన్న ఆకుపచ్చ క్యాండిల్ స్టిక్ పైకి ఉన్న ధోరణి (trend) అంటే కొనుగోళ్ల ఒత్తిళ్ల  (bullish) ను సూచిస్తుంది, మరియు  closing price opening price కంటే కింద ఉన్న ఎర్రని క్యాండిల్ స్టిక్  దిగువ ధోరణి (downward trend) అంటే అమ్మకాల ఒత్తిళ్ల (bearish) ను సూచిస్తుంది.

 

క్యాండిల్ స్టిక్ చార్టింగ్  టెక్నికల్ అనాలిసిస్లో అత్యధికంగా ఉపయోగించబడిన మరియు ప్రజాదరణ పొందిన చార్టింగ్ పద్ధతులలో ఒకటి. ఇది మార్కెట్ మనోభావాలకు , మరియు మార్కెట్ పాల్గొనేవారి మనస్తత్వాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ఏదైనా స్టాక్ /ఇండెక్స్  యొక్క క్యాండిల్ స్టిక్ చార్టుల ద్వారా చూపించబడే మార్కెట్ల యొక్క 5 దృశ్యాలను మేము కింద జాబితా చేసాము.

కొనుగోలుదారులు & అమ్మకదారుల బలం

ఇది body యొక్క పొడవు ద్వారా వర్ణించబడుతుంది. body ఎంత పొడవుగా ఉంటే, కౌంటర్ అంటే షేర్లో కొనుగోలు/అమ్మకం ఒత్తిడి అంత బలంగా ఉంటుంది.

స్టాక్ యొక్క అస్థిరత

ఇది స్టాక్  చేసే షాడో ద్వారా వర్ణించబడుతుంది. high మరియు low షాడో body కంటే  పొడవుగా ఉంటే, స్టాక్  చాలా అస్థిర సెషన్‌ను చూసిందని దాని అర్థం.

స్టాక్‌లో ధోరణి (trend)

పెద్ద సంఖ్యలో వరుసగా ఉన్న ఆకుపచ్చ లేదా ఎర్రని క్యాండిల్ స్టిక్ లు  ఒక స్టాక్‌ లోని ఒక స్పష్టమైన ధోరణి (trend)ని సూచిస్తాయి. ఉదాహరణకు, వరుసగా 3 లేదా అంతకంటే ఎక్కువ ఆకుపచ్చని క్యాండిల్ స్టిక్ లు ఉంటే, స్టాక్  తక్షణ అప్‌ట్రెండ్‌ (uptrend)లో ఉన్నట్టు అర్థం. అదే విధంగా, స్టాక్  వరుసగా 3 లేదా అంతకంటే ఎక్కువ ఎర్రని క్యాండిల్ స్టిక్ల ను తయారు చేస్తే, ఇది స్టాక్‌ లోని తక్షణ క్షీణత మరియు తదుపరి బేరిష్ ఊపు(bearish momentum) ని సూచిస్తుంది.

1 నిమిషం, 1 రోజు, 1 వారం లేదా 1 నెల డేటాను ఉపయోగించి ఈ కాండిల్ని ఏర్పాటు చేయవచ్చు. పై ఉదాహరణలో ఇది రిలయన్స్ (Reliance) యొక్క 1 వారం డేటాను ఉపయోగించి ఏర్పాటు చేయబడింది. ప్రతి కాండిల్  1 వారం వ్యవధిలో స్టాక్  ఎలా పని చేసిందో తెలుపుతుంది.

కాండిల్ స్టిక్